స్వచ్చతతో ఆరోగ్యకర సమాజం: ఏడీ జే.హేమంత్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వచ్చత తోనే ఆరోగ్యకరం అయిన సమాజం రూపొందుతుందని,పరిసరాల పరిశుభ్రత తోనే ప్రగతి సాధ్యం అని,పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత పరిగణించాలని,సమిష్టి కృషితోనే స్వచ్ఛ భారత్ సాధ్యమని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్ కుమార్అన్నారు. వ్యవసాయ కళాశాల ఆద్వర్యంలో చివరి సంవత్సరం వ్యవసాయ విద్యార్ధులు చే మండలంలోని నారాయణ పురంలో  నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం
– ప్రత్యేక శిబిరం
రెండవ రోజు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించిన అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో భాగంగా విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో స్వచ్ఛత ర్యాలీ ని నిర్వహించారు.అదేవిధంగా నారాయణపురం బస్టాండ్ దగ్గర మానవహారం నిర్వహించారు.తరువాత గ్రామంలోని రోడ్లు, గ్రామపంచాయతీ కార్యాలయం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైతు వేదిక, పశు వైద్యశాల పరిసరాలను విద్యార్థులు శుభ్రం చేసారు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మరుగు దొడ్లు కు మరియు ప్రహరీ గోడకు జాతీయ సేవా పథకం స్వయం సేవకులు సున్నం వేసారు. తరువాత జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు భూసార పరీక్షల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు రైతుల పంట భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించి వ్యవసాయ కళాశాలలోని భూసార పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అధ్యాపక బృందం ఎం. రాంప్రసాద్,పి.రెడ్డి ప్రియ,ఆర్. రమేష్,ఎస్. మధుసూదన్ రెడ్డి ఎస్. జగదీశ్వర్, షేక్ అస్లాం తో పాటు కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.
Spread the love