టాస్ గెలిచిన గుజరాత్.. ఢిల్లీ బ్యాటింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. 8 మ్యాచ్లలో 4 గెలుపులతో గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానంలో, 3 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో ప్లేస్లో ఉన్నాయి. నేడు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్ల కెప్టెన్లు గిల్, పంత్ భావిస్తున్నారు.
గుజరాత్‌ జట్టు: వృద్ధిమాన్‌, గిల్‌, మిల్లర్‌, ఒమర్జాయ్‌, తెవాటియా, షారుఖ్‌, రషీద్‌, సాయి కిషోర్‌, నూర్‌, మోహిత్‌, సందీప్‌
ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, జేక్‌ ఫ్రెసర్‌, పోరెల్‌, షై హోప్‌, రిషభ్‌, స్టబ్స్‌, అక్షర్‌, కుల్దీప్‌, నోర్జె, ఖలీల్‌, ముకేశ్‌

Spread the love