ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పథకాల వివరణ: చిన్నారెడ్డి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి వివరించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి హామీల వద్ద మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి అర్గుల్ ఎంపీటీసీ వనిత మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ మనందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతుందని ఉపాధి కూలీలకు తెలియజేశారు. అదేవిధంగా సబ్సిడీ పైన సిలిండర్లను అందజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మండలాలను పొందుతుందని తెలియజేశారు. నిజాంబాద్ జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Spread the love