ప్రచార అస్త్రంగా మారిన లేండి ప్రాజెక్టు

– ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి లేండి ప్రాజెక్టు జ్ఞాపకం

– ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి నోట లేండి మాట

నవతెలంగాణ మద్నూర్ :
ఎన్నికలు వస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పెండింగులో గల లేండి ప్రాజెక్టు నిర్మాణం జ్ఞాపకం వస్తుంది 2014 నుండి 2023 వరకు మూడోసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండుసార్లు ముఖ్యమంత్రి ఆయంలో అంతకు మునుపు బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం జుక్కల్ నియోజకవర్గం లో పర్యటిస్తూ పెండింగ్ లేండి ప్రాజెక్టు పనులను అధికారంలోకి రాగానే ఇక్కడే ఉంటూ అధికారులను రప్పించి మహారాష్ట్ర అధికారులతో చర్చించి ప్రాజెక్టును పూర్తి చేయిస్తానని హామీలు ఇవ్వడం లేండి ప్రాజెక్టు నిర్మాణం పనులు గడిచిన 10 సంవత్సరాల కాలంగా పూర్తి చేయకుండా ఎన్నికల ప్రచార ఆశ్రయంగా వాడుకోవడం ముఖ్యమంత్రికి దక్కింది 2014 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బిచ్కుంద మండలంలోని పత్లాపూర్ గ్రామంలో జరిగిన సభకు హాజరై పెండింగులో గల లేండి ప్రాజెక్టును ఇక్కడే నిద్రపోతా లేండి ప్రాజెక్టును పూర్తి చేయిస్తానని అప్పటి ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లోని పెద్ద కోడప్పగల్ గ్రామ సమీపంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి హాజరై అధికారంలోకి రాగానే లేండి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి సోమవారం నాడు జుక్కల్ చౌరస్తాలో నిర్వహించిన సభకు హాజరై మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రి నోట లేండి ప్రాజెక్టు మాట వినిపించారు ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే మహారాష్ట్ర అధికారులతో చర్చించి పెండింగ్లో గల లేండి ప్రాజెక్టును ఇక్కడి అధికారులతో పూర్తి చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో మళ్లీ ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే లేండి ప్రాజెక్టు ఏళ్ల తరబడి పూర్తి చేయకుండా ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవడం ప్రజలకు మభ్యపెట్టడమేనని ముఖ్యమంత్రి మాటను బట్టి తెలుస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి లేండి ప్రాజెక్టు పనులు పూర్తికాకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లోని పెట్టడం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లేండి ప్రాజెక్టు నిర్మాణం పనులను ప్రచారాస్త్రంగా వాడుకోవడం దాదాపు 40 సంవత్సరాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా లేండి ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేండి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించండి పెండింగ్ లో గల లేండి ప్రాజెక్టును అధికారంలోకి రాగానే పూర్తి చేయిస్తానని చెప్పడం ఇది ముఖ్యమంత్రికి తగునని ప్రజలు ఆచార్యపోతున్నారు అంతర్రాష్ట్ర లేండి ప్రాజెక్టు పనులు పూర్తి అవుతే మద్నూర్ బిచ్కుంద మండలాల్లోని 22 వేల ఎకరాల  భూమికి సాగు నీరు అందుతుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రత్యేక రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రెండోసారి అధికారం చేపట్టిన పూర్తి చేయకపోవడం మళ్లీ ఎన్నికల ప్రచారంలో ఈసారి గెలిస్తే లేండి ప్రాజెక్టును పూర్తి చేయిస్తానని చెప్పడం ఎన్నికల ప్రచారానికి ప్రచారాస్త్రంగా మారిందని చెప్పవచ్చు లేండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు వందల ఎకరాల రైతుల భూములు కోల్పోవలసి వచ్చింది అప్పట్లో ఎకరానికి 80,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందించి రైతుల భూములు లాక్కుంది ఏండ్ల తరబడి నీరు రాక సాగునీరు అందక లేండి కాలువల నిర్మాణం కోసం మద్నూర్ బిచ్కుంద మండలాల పరిధిలో వందల మంది రైతులు తమ భూములు కోల్పోయారు. ప్రస్తుతం భూముల ధర ఎకరానికి తక్కువలో తక్కువ 25 లక్షల రూపాయలు పలుకుతుంది ఇలాంటి భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల కుటుంబాలు లబోదిబోమంటున్నారు.
Spread the love