గిరిజన జాతీయ కమిషనర్ హుస్సేన్ నాయక్ కు వినతి
నవతెలంగాణ – డిచ్ పల్లి
బీబీపూర్ వద్ద రైల్వే గేట్ లేదా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో తాండ వాసులు గిరిజన జాతీయ కమీషన్ హుస్సేన్ నాయక్ కు వినతి పత్రాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పలుమార్లు రైల్వే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సమస్యను విన్నవించామని అన్నారు. ఇప్పటి వరకు అధికారులు స్పందించిన పాపాన పోలేదని వారు వాపోయారు. ప్రస్తుతం బీబీపూర్ తండా వసూలకు, అవుసుల తాండ, నర్సింగ్ పల్లి, కమలాపూర్ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజలకు అటువైపు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే డబ్లింగ్ రైల్వే లైనింగ్ పనులు జరుగుతున్నాయని, పనిలో పనిగా బీబీపూర్ వద్ద కూడా రైల్వే గేట్ లేదా రైల్వే అండర్ రోడ్డును అత్యవసరంగా నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. దీనివల్ల దాదాపు 10 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని ఉన్న విషయాలను కమిషనర్ కు వివరించినట్లు తెలిపారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించారని బీబీపూర్ తండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఉపసర్పంచ్ సుధాకర్ , పేద్ద నాయక్ వసంత్ , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేగేట్ లేదా అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



