పేద ప్రజలకు అండ ఎర్రజెండా

నవతెలంగాణ- తిరుమలగిరి
పేద ప్రజలకు అండ ఎర్రజెండాఅని, పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు పేదల వెంట ఉంటామని జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య అన్నారు. మండలం వెలిశాల గ్రామంలో గత తెలుగు దేశ ప్రభుత్వం పేదల కోసం కొన్న ఇంటి స్థలాలను పేదలకు పంచాలని సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేదల హత్య స్థలంలో ఎర్రజెండాలు పార్టీ నివాసం ఏర్పరచుకున్నారని పేదల గుడిసెలు తొలగించి పేదలపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదన్నారు. గురువారం మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వెలిశాల గ్రామంలో సర్వేనెంబర్‌ 146 నాలుగు ఎకరాల భూముల్లో పేదలకు ఈ భూమిని పంచుతామని స్థానిక శాసనసభ్యులు గాదరి కిషోర్‌ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో శిలాఫలకం నాటి నేటికీ ఏడున్నరేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు పేదలకు పంచకపోవడం శో చనీయమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం తక్షణమే అమలు పరచాలని లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆ భూమిపై పేదలు గుడిసెలు ఏపిస్తామని హెచ్చరించారు. పేదలపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి, అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు కడారి లింగయ్య, ఆ పార్టీ శాఖ కార్యదర్శి దుపట్టి రాములు, గుడిసె నిర్వహిస్తున్న పోరాట కమిటీ నాయకులు చిత్తలూరు సోమయ్య, పల్లె బొడ్డు హనుమంతు, దూపటి శంకరయ్య, పాల బిందెల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love