స్కూల్‌ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

నవతెలంగాణ – ఉత్తరాఖండ్‌ : స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్‌ రాష్ట్రంలో మోటహల్దులోని జాతీయ రహదారిపై జియో (రిలయన్స్‌) పెట్రోల్‌ పంపు ముందు స్కూల్‌ పిల్లలతో వెళుతున్న షాంఫోర్డ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకెళితే..  నిన్న ఉదయం షాంఫోర్డ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ ఖేమ్‌ సింగ్‌ ఎప్పటిలాగే హల్దు చౌడ్‌ గ్రామీణ ప్రాంతాల నుండి 37 మంది పిల్లలతో పాఠశాలకు వెళుతున్నాడు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో మోటహల్దు హైవేపై బస్సు లోపల ఇంజిన్‌ నుంచి దుర్వాసన రావడంతో డ్రైవర్‌ హడావుడిగా దాన్ని హైవే పక్కన నిలిపాడు. కొద్దిసేపటికే బస్సు ఇంజన్‌ నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో చిన్నారుల్లో అరుపులు వినిపించాయి. చిన్నారుల అరుపులు విని పక్కనే పని చేస్తున్నవారు, బాటసారులు బస్సు వైపు పరుగులు తీశారు. అయితే, అప్పటికే డ్రైవర్‌ బస్సు ఎమర్జెన్సీ డోర్‌ను పగులగొట్టి పిల్లలను బయటకు తీయడం ప్రారంభించాడు. అదే సమయంలో స్థానికులు జగదీష్‌ చౌహాన్‌, హుకమ్‌ సింగ్‌, మన్ను బిష్త్‌ కూడా చేరుకున్నారు. మొత్తం 37మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం బస్సులోని మంటలను ఆర్పేందుకు డ్రైవర్‌ ప్రయత్నించగా అతడి చేతులు కాలాయి. అదే సమయంలో, సమీపంలోని ఎన్‌హెచ్‌ నిర్మాణంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీ ఉద్యోగులు, క్యాంపు సమీపంలో నిలబడి ఉన్న నీటి ట్యాంకర్లను పైపులతో కనెక్ట్‌ చేసి, బస్సుపై నీటిని చల్లడం ప్రారంభించారు. మంటలు చెలరేగడంతో ప్రజలు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి హల్దు చౌద్‌ పోలీస్‌ పోస్ట్‌ ఇన్‌ఛార్జ్‌ సోమేంద్ర సింగ్‌ చేరుకున్నారు. అయితే అగ్నిమాపక దళం వాహనాలు వచ్చే సమయానికి బస్సులో మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో డ్రైవర్‌ చేతులు కాలాయి. బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్‌సర్క్యూటే కారణమని చెబుతున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం మరో బస్సును పిలిపించి పిల్లలను సురక్షితంగా పాఠశాలకు పంపించింది. బస్సులో మంటలను అదుపు చేసేందుకు దాదాపు గంటపాటు శ్రమించారు. ప్రజలు అగ్నిమాపక శాఖకు ఫోన్‌లో సమాచారం అందించగా.. సమాచారం అందుకున్న గంట తర్వాత ఆ శాఖ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లలు సురక్షితంగా ఉన్నారని, పిల్లలకు లేదా సిబ్బందికి ఎలాంటి హాని జరగదని, తల్లిదండ్రులు ఎలాంటి తప్పుడు పుకార్లను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Spread the love