Saturday, May 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసూక్ష్మ పరిశ్రమలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

సూక్ష్మ పరిశ్రమలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

- Advertisement -

దానివల్ల స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
పెట్టుబడి, ముడిసరుకు, మానవ వనరులు, మార్కెటింగ్‌‌పై 
దృష్టి పెట్టాలి
కర్నాటక స్మాల్‌ ‌స్కేల్‌ ఇండస్ర్టీస్‌ ఎగ్జిబిషన్‌ ‌ప్రారంభోత్సవ సదస్సులో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్ష‍ులు ఏపీకే రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో సూక్ష్మ పరిశ్రమలపై దృష్టి పెడితే ఎక్కడికక్కడ స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌స్మాల్‌ అండ్‌ ‌మీడియం ఎంటర్‌‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్ష‍ులు ఏపీకే రెడ్డి చెప్పారు. భారతదేశంలో 98 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయన్నారు. అందువల్ల కేంద్రంలో సూక్ష్మ పరిశ్రమల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. వాటితోపాటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలనూ అభివృద్ధి చేయాలన్నారు. ఈ పరిశ్రమలన్నీ పెట్టుబడి, ముడిసరుకులు, మానవ వనరుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. శుక్రవారంనాడిక్కడి తుముకూరులో కర్నాటక స్మాల్‌ ‌స్కేల్‌ ఇండస్ర్టీస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆ రాష్ర్ట హోం శాఖ మంత్రి డాక్టర్‌ ‌జీ పరమేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఏపీకే రెడ్డి మాట్లాడారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనీ, సమగ్రవృద్ధి, ఉపాధి కల్పన, నూతన ఆవిష్కరణలకు ఇదే ప్రధాన వేదిక అని చెప్పారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా దేశంలో చమురు సంక్ష‍ోభం ఏర్పడిందనీ, దీనివల్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం తీవ్రంగా నష్టపోతున్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో ఫౌండ్రీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సిరామిక్స్ తయారీదారులు తీవ్రమైన సంక్ష‍ోభాన్ని ఎదుర్కొంటున్నారనీ, అనేక పరిశ్రమలు మూసివేతలను ఎదుర్కొంటున్నాయని వివరించారు. పారిశ్రామిక ప్రగతికి తిరుపతిలోని శ్రీసిటీ రోల్‌‌మోడల్‌‌గా నిలుస్తుందన్నారు. 8,500 ఎకరాల్లో ఏర్పాటైన శ్రీసిటీలో 230కి పైగా కంపెనీలు, 31 జపనీస్‌ ‌సంస్థలు ఏర్పాటయ్యాయనీ, దీనివల్ల ఇక్కడ 65 వేలమంది ఉద్యోగులకు ఉపాధి లభిస్తున్నదని వివరించారు. అలాంటి శ్రీసిటీతో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ భాగస్వామ్యమైందనీ, నైపుణ్య శిక్షణ, వెండర్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ బదిలీ, ప్రదర్శనల కోసం ఒప్పందాలు జరిగాయని వివరించారు.

దీనిలో భాగంగానే రౌతుసురమల వద్ద ఒక ఎస్‌ఎమ్‌ఈ పార్క్‌ను స్థాపించడానికి కృషి జరుగుతున్నదని తెలిపారు. 500 ఎకరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందనీ, వరదయ్యపాలెం మండలం, కాదూరు గ్రామం వద్ద 507.68 ఎకరాల భూమిని గుర్తించారన్నారు.ఇది శ్రీ సిటీకి 17.5 కి.మీ, చెన్నై సీ పోర్ట్‌కు 79.6 కి.మీ, రేణిగుంట విమానాశ్రయానికి 68 కి.మీ దూరంలో ఉందన్నారు. ఐదేండ్లలో ప్రతిపాదిత పెట్టుబడి రూ. 2,000 కోట్లుకాగా, 23వేల మందికి ప్రత్యక్ష‍ ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు 150 మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారనీ, 70 దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయని తెలిపారు. త్వరలో తెలంగాణలో కూడా శ్రీసిటీ సహకారం, మోడల్‌‌లో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తుందనీ, దీనికోసం సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబును కలుస్తామన్నారు. ఈ సందర్భంగా కర్నాటక హోం మంత్రికి ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ పారిశ్రామిక ప్రతిపాదనలను అందచేశారు. సదస్సుకు హాజరైన పలువురు పారిశ్రామికవేత్తలు నూతన పారిశ్రామిక పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. సదస్సులో కర్నాటక స్మాల్‌ ‌స్కేల్‌ ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష‍, ఉపాధ్యక్ష‍ులు బీఆర్‌ ‌గణేశ్‌‌రావు, నింగన్న ఎస్‌ ‌బిరదార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -