స్వల్పంగా పెరిగిన ఆయిల్ ఫాం గెలలు ధర…

– ఫిబ్రవరి లో టన్ను గెలలు ధర రూ.14,174 లు..
– జనవరి కంటే అదనంగా రూ.1,039 పెరుగుదల…
– గడిచిన ఆర్ధిక సంవత్సరంలో మొత్తంలో అత్యధికం…
– సాగు దారులకు స్వల్ప ఊరట…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం గెలలు ధరలలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది.ఫిబ్రవరి నెల కు చెల్లించాల్సి గెలలు ధరను మార్చి ఒకటి సోమవారం ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి ప్రకటించారు.టన్ను గెలలు ధర రూ.14,174 లు గా ఆయన పేర్కొన్నారు.జనవరి లో టన్ను గెలలు ధర రూ.13,135 ఉండగా ఫిబ్రవరి లో రూ.14,174 లు కు చేరింది.దీంతో జనవరి తో పోల్చితే టన్ను కు అదనంగా రూ.1,039 లు స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది.2023 – 2024 ఆర్ధిక సంవత్సరంలో ఇదే అత్యధిక ధర కావడంతో రైతులకు స్వల్ప ఊరట అనే చెప్పు కోవాలి.గడిచిన ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ – 23 లో రూ.14205 లు,మే – 23 లో రూ.13346 లు,జులై – 23 లో రూ.13091 లు,ఫిబ్రవరి – 24 లో రూ.13135 లు ఉండగా మిగతా నెలల్లో ఏ నెల లోనూ రూ.12 వేలు పైన రూ.13 వేలు లోపు కంటే ఎక్కువగా ధర రాలేదు.
2023 – 2024 ఆర్ధిక సంవత్సరంలో టన్ను గెలలు ధరలు :
నెల                         ధర                  వ్యత్యాసం    
ఏప్రిల్ – 2023        14205
మే     – 2023         13346                  – 859
జూన్  – 2023        12623                   – 723
జులై   – 2023         13091                 + 468
ఆగస్ట్ – 2023         13026                  –   65
సెప్టెంబర్ – 2023    12231                 ‌  – 795
అక్టోబర్ – 2023      12996                  + 765
నవంబర్ – 2023     12525                  –  471
డిసెంబర్ – 2023     12534                   –   09
జనవరి – 2024       12681                   +147
ఫిబ్రవరి  – 2024      13135                   + 454
మార్చి – 2024         14174                  + 1039
ఈ లెక్కలు ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం మార్చి నుండి మెరుగైన ధరలు వచ్చే అవకాశం ఉండొచ్చు అని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
Spread the love