ఆళ్ళపల్లి నిరుపేద యువకుడికి ఈఎంటి సర్టిఫికెట్ ప్రదానం 

– ఆకాష్ ను అభినందించిన పలువురు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన పరమ ఆకాష్ కు ఇటీవల జరిగిన 108 ఈ.ఎం.టీ శిక్షణా తరగతుల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు గాను సంబంధిత అధికారులు సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ.. ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని రామవరం రైతు వేదికలో ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ ఇ.ఎం.ఇ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో వివిధ మండలాలలో 108 లో అత్యవసర సేవలు అందిస్తున్న ఈ.ఎం.టీలకు శిక్షణా తరగతులు జరిగాయని అన్నారు. అందులో భాగంగా ఈఎంటీలకు ప్రధమ చికిత్స వైద్యం, తదితర అంశాలపై గజేందర్, ప్రమోదులు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన వారిలో తాను అత్యుత్తమ ప్రతిభను చూపడంతో సంబంధిత అధికారుల చేతుల మీదుగా 108 ఈ.ఎం.టి సర్టిఫికెట్ మంగళవారం అందుకోవడం జరిగిందని తెలిపారు. నిరుపేద కుటుంబ నేపథ్యం ఉన్న యువకుడు ఆకాష్ శిక్షణా కార్యక్రమంలో శ్రద్ధగా నేర్చుకుని ఈ.ఎం.టి సర్టిఫికెట్ అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి, తనని అభినందించారు.
Spread the love