బాల్ భవన్ వ్యవస్థాపక అధ్యక్షులు వివి రామయ్యకు నివాళులు…

నవతెలంగాణ – సూర్యాపేట
బాల్ భవన్ వ్యవస్థాపక అధ్యక్షులు వివి రామయ్య ఈ నెల 17 శనివారం ఉదయం మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా నేడు బాల్ భవన్ లో అభివృద్ధి కమిటీ, పూర్వ విద్యార్థుల కమిటీ, పేరెంట్స్ కమిటీ, జిల్లా డాన్స్ అసోసియేషన్, విజయ భాను కళా సమితి, సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం హమీద్ ఖాన్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణ వేదికగా పిల్లలు తమయొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలు చెడు దార్లు పట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది అని 1980 లో ప్రభుత్వము జవహర్ బాల కేంద్రాలను రాష్ట్రమంతటా పలు చోట్ల కేటాయించగా సూర్యాపేట బాల్ కేంద్రం ఏర్పాటు సమయంలో కళా కారుల సమాఖ్య కమిటీ అధ్యక్షులు అయిన వివి రామయ్య మరియు పలువురిని బాల్ కేంద్ర అభివృద్ధి కమిటీ వేయడం జరిగింది ఆనాటి కలెక్టర్ రాజా రెడ్డి. బాల్ కేంద్రం ఏర్పాటు పనులలో రామయ్య ప్రముఖ పాత్ర వహించారు. ఎందరినో కూడగట్టుకుని చిన్నారులకు ఉచితంగా లలిత కళలు శిక్షణ అందివ్వడం కోసం కృషి చేశారు. రామయ్య తన తుదిశ్వాస వరకు లయన్స్ కంటి ఆసుపత్రి ఏర్పాటు, స్పందన అవయవదానం, కళా సమాజాల సమాఖ్య వంటి పలు స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి సమాజ సేవ చేశారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఇంధన శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో బాల్ కేంద్ర బాల్ భవన్ గా మార్పు చెంది ఎందరో చిన్నారులకు శిక్షణ అందించే సామర్థ్యం సంపాదించుకునే క్రమంలో రామయ్య పాత్ర ఎనలేనిది అని చెప్పవచ్చు అన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రతి రోజూ సమాజ సేవలో నిమగ్నమై తన శరీరాన్ని సైతం మెడికల్ కాలేజీ కి డొనేట్ చేసిన మహనీయుడు రామయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెన్న కవిత, వెన్న శ్రీనివాస్ రెడ్డి, ఆలూరి విక్టర్, బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి, సిబ్బంది ఎల్లయ్య, సింగ్, ఉమా, అనిల్, సాయి, వీరయ్య, పద్మ, సునీత,బాల కృష్ణ,భార్గవ తదితరులు పాల్గొన్నారు.

Spread the love