శ్రామిక వర్గ విముక్తికి ఆలాపన చేయడమే కానూరుకి నివాళి

– అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు.
నవతెలంగాణ – మాక్లూర్ 
శ్రామిక వర్గ విముక్తికై, ఆలాపన, చేయడమే కానూరి కి నిజమైన నివాళి అని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. శనివారం మండలంలోని బొర్గం (కే) గ్రామంలో  కానూరి వెంకటేశ్వరరావు తొమ్మిదవ స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జననం, మరణం సహజమే కానీ జీవితాంతం జనం కోసం జీవించడం ఉన్నతమని కానూరి సాంస్కృతిక సైనికాధిపతిగా పనిచేసి ప్రజా కళాకారులకు స్ఫూర్తిని ఇచ్చారని ఆయన తెలిపారు. ఇందిరమ్మ జైల్లో పెట్టిన తన కళం స్వరం ప్రజలపక్షమేననీ నిరూపించారని ఆయన అన్నారు. కళ కాసుల కోసం కాదని, అనేక అవకాశాలు వచ్చిన, విస్మరించి, పీడిత జన రాగ మై  అరుణోదయ కీర్తిని ఆకాశానికి ఎత్తాడని ఆయన తెలిపారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అరుణోదయ గలం, ఆలాపన కొనసాగుతూనే ఉంటుందని దాసు అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి ఎస్కే. అబ్దుల్, అరుణోదయ, ప్రజా సంఘాల నాయకులు దెశెట్టి సాయి రెడ్డి, కృష్ణా గౌడ్, శంకర్, నాగేష్, గంగాధర్, రాధా, సరోజిని తదితరులు పాల్గొన్నారు.
Spread the love