నసురుల్లాబాద్ బ్యాంక్ మేనేజర్ కు సన్మానం

నవతెలంగాణ – నసురుల్లాబాద్
జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ (డిసిసిబి) నసురుల్లాబాద్ మేనేజర్ రాకేష్ గత 4 సంవత్సరాల నుండి విశిష్ట సేవలు అందిస్తూ, నిజామాబాద్ మేన్ బ్రాంచుకు బదిలీ
పై వెళ్లడంతో నసురుల్లాబాద్ మండలం బ్యాంకు పరిధిలో ఉన్న ఐదు సొసైటీల కార్యదర్శులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా సూట్ సొసైటీల కార్యదర్శులు మాట్లాడుతూ సహకార బ్యాంకు లో ప్రజల యొక్క మన్ననలను పొందుతూ, ప్రజలకు సేవలందించడంలో ఆయన ఎల్లప్పుడు ముందున్నారని అన్నారు. రైతులకు ప్రజలకు సేవలు అందిస్తూ మరెన్నో ఇలాంటి సన్మానాలు పొందాలని వారు కోరారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రాకేష్ మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేసిన ఖాతాదారులకు సహకార సొసైటీ కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శులు గంగారం దుర్కి, శ్రీనివాస్ నసురుల్లాబాద్, మోహన్, నాచుపల్లి నరేందర్ మైలారం, బ్యాంక్ సిబ్బంది సహకార సంఘం సిబ్బంది తదితరులు ఉన్నారు.

Spread the love