ఎల్లమ్మ సిద్ధోగానికి మెదక్ ఎంపీ హాజరు

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగం ఘనంగా నిర్వహించారు. ఈ ఎల్లమ్మ సిద్ధోగ మహోత్సవానికి మంగళవారం మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమ్మవారి కరుణ కటాక్షాలు దుబ్బాక నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని
ఆకాంక్షించారు. అంతక ముందు ఎంపీని గౌడ సంఘం సభ్యులు శాలువాతో సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ వెంట మండలపార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, గంభీర్ పూర్ సర్పంచ్ కరికే భాస్కర్, కొత్త కిషన్ రెడ్ది, గంభీర్పూర్ గౌడ సంఘం నాయకులు ఉన్నారు

Spread the love