రేషన్ కార్డుదారులకు బంపర్ న్యూస్..

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సన్న బియ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్‌, మిల్లింగ్‌పై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు.

 

 

 

 

 

ఈ క్రమంలోనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ సెంటర్లకు సన్న బియ్యం అందిస్తుండగా రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వారి కోసం ప్రతి నెలా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందిస్తుండగా.. ఏడాదికి 21 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పీడీఎస్‌ ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టుబోతోంది.

Spread the love