నూతన వధూవరులకు కళ్యాణ కానుక అందజేత

– నగదు అందజేస్తున్న సర్పంచ్ నరసయ్య
నవతెలంగాణ – వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్ట శ్రీనివాస్ విజయ దంపతులకు కూతురు శిరీషకు గురువారం వివాహమైంది. కాగా ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ పోతుల నరసయ్య కళ్యాణ కానుకగా రూ.5016లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మీ- భూమయ్య, వార్డ్ మెంబర్లు చింతల రాజయ్య, మాడ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య , పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, మాధవ రెడ్డి, జనార్దన్ రెడ్డి, గుంటి రాజయ్య, కొండాల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love