ప్రియుడి కోసం.. భర్తని హత్య చేయించిన భార్య

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రియుడి కోసం.. భర్తని హత్య చేయించింది ఓ భార్య. ఈ దారుణమైన సంఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఉపాధ్యాయుడు జాదవ్‌ గజానంద్‌ జైనథ్‌ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విస్తుపోయే విషయాలు తెలిసాయి. మృతుడి భార్య విజయలక్ష్మి.. మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కొన్ని ఫోటోలను గుర్తించారు పోలీసులు. అయితే ప్రియుడి కోసమే భార్య విజయలక్ష్మి సుపారీ గ్యాంగ్‌తో ఫోన్లో‌ మాట్లాడి భర్తను హత్య చేయించినట్టుగా గుర్తించిన పోలీసులు…వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ చేస్తున్నారు.

Spread the love