పోలీస్‌ చెంపపై కొట్టిన మహిళ..

నవతెలంగాణ- న్యూఢిల్లీ: డ్యూటీలో ఉన్న పోలీస్‌ చెంపపై ఒక మహిళ కొట్టింది. ఆ పోలీస్‌తో వాగ్వాదానికి దిగింది. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కారులో వచ్చిన ఒక మహిళ విధుల్లో ఉన్న పోలీస్‌తో వాదనకు దిగింది. అంతేగాక అతడి చెంప చెళ్లుమనిపించింది. డ్రెస్‌ కాలర్‌ పట్టుకుని మరోసారి చెంపపై కొట్టింది. ఇంతలో అక్కడున్న వారు జోక్యం చేసుకున్నారు. దీంతో ఆ మహిళ తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే మహిళ ఆ పోలీస్‌ చెంపపై ఎందుకు కొట్టింది అన్నది తెలియలేదు.

Spread the love