మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయండి

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీను నాయక్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న పనిలో మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులు పదమూడు రోజులుగా చేస్తున్న ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీను నాయక్‌ అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు శ్రీను నాయక్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాన్ని సైతం లెక్కపెట్టకుండా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పార్టీల నాయకులు మద్దతు తెలపాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలను ఆరోగ్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి పని చేస్తున్నారని కానీ ప్రభుత్వం వారి శ్రమను గౌరవించకుండా కనీస వేతనం ఇవ్వకుండా వారి శ్రమను దోచుకుంటుందని అన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సఫాయి కార్మికునికి సలాం అంటున్నాడే తప్ప సఫాయి అన్నకు జీతాలు మాత్రం పెంచడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చలకు ఆహ్వానించాలని వెంటనే వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు జంగయ్య, యాదయ్య, అంజయ్య, మల్లయ్య, కృష్ణయ్య, చంద్రమ్మ, ప్రమీల, జంగయ్య, సురేష్‌, పద్మమ్మ, బాలమణి, రామస్వామి, నరసింహ, జంగమ్మ, నరసమ్మ, మైసమ్మ, జంగమ్మ, చిట్టెమ్మ, శ్యామలమ్మ, పార్వతమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

Spread the love