సంగారెడ్డిలోఎబివిపి అరాచకం..

– SFI జిల్లా కార్యదర్శి రమేష్ పై దాడి
– ప్లీనరీ సమావేశాలను అడ్డుకునే కుట్ర
నవతెలంగాణ — మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి లో ఎబివిపి ఆచకానికి పాల్పడింది గురువారం రాత్రి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ పై ఆ కారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గురువారం రాత్రి సంగారెడ్డి పట్టణంలోని ఐబీ సెంటర్లో ఎస్ఎఫ్ఐ తోరణాలు కడుతున్న పలువురు కార్యకర్తలతో ఎబివిపికి చెందిన కార్యకర్తలు గొడవపడ్డారు. ఈ దాడిలో రమేష్ తలకు బలమైన గాయమైంది. ఈ నెల 8 నుంచి 10వ తేది వరకు సంగారెడ్డి పట్టణంలో ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరనున్నాయి. ప్లీనరీ ప్రచారం కోసం ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు తోరణాలు కడుతుండగా ఎబివిపి వాళ్లు గుంపు వచ్చి కర్రలతో దాడి చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మకాం వేసిన ఎబివిపి వాళ్లు ఉద్దేశ పూర్వకంగానే దాడికి పాల్పడ్డారు. ఎస్ ఎఫ్ ఐ ప్లీనరీ సమావేశాలు జరగకుండా చేసేందుకే దాడి చేసినట్లు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రవి అన్నారు. దాడి చేసిన వ్య క్తులను కటినంగా శిక్షించాలని రవి డిమాండ్ చేశారు.

Spread the love