వాలంటీర్లకు సర్టిఫికెట్ల అందజేసిన ఏసిపి..

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
అత్యవసర పరిస్థితులలో 24 అంశాలపై  ఫస్ట్ రెస్పాండెంట్ ప్రధమ చికిత్స, సిపిఆర్ ,ఏఈడి పై కమిషనర్ కార్యాలయంలో శిక్షణ పొందిన వాలంటీర్లకు శుక్రవారం హుస్నాబాద్ ఏసీపి కార్యాలయంలో సర్టిఫికెట్లను ఎసిపి సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు మీ బంధువులకు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధమ చికిత్స ఎలా చేయాలో అనే అంశాలు తెలియపరచాలని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా పనిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సీరియస్ గా దెబ్బలు కలిగిన వ్యక్తిని వెంటనే సంబంధిత హాస్పిటల్ కు పంపించడం చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ ఎర్రల్ల కిరణ్, ఎస్ఐ మహేష్, కోహెడ ఎస్ఐ నరేందర్ రెడ్డి, అక్కన్నపేట ఎస్ఐ వివేక్,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love