నవతెలంగాణ – జన్నారం : మండలంలోని మందపల్లి గ్రామంలో అల్లం వారి కుంట 20 ఎకరాల పైగా ఉన్న చెరువు, పూర్తిగా కబ్జాకు గురి అయి ప్రస్తుతం రెండెకరాలే ఉందని దీంతో చెరువు ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు పూర్తిగా పండే అవకాశాలు లేవని మందపల్లి గ్రామ ప్రజలు ఆదివారం జన్నారం ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగే గొల్ల కుంట చెరువు 10 ఎకరాలు ఉంటే ప్రస్తుతం మూడెకరాలే ఉందన్నారు. ఊరకుంట చెరువు అయితే పూర్తిగా కబ్జా అయిందన్నారు. ఈ చెరువుల కింద ఉన్న భూములు ఎడారులుగా మారే పరిస్థితి ఉందన్నారు. కబ్జా చేసిన వారిని ప్రభుత్వం రెవెన్యూ అధికారులు గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న నలుగురు పెద్దమనుషులు, చెరువు భూములను కబ్జాలు చేస్తూ లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. చెరువులు లేక వేసవిలో బోరు బావులు బావులు అడుగంటిపోతున్నాయన్నారు. చెరువు పై ఆధారపడి జీవిస్తున్న పశుపక్షాదులు కూడా నీరు లేక తల్లా దిల్లుతున్నాయన్నారు. కబ్జా ఆయన చెరువులను అన్నిటిని గుర్తించి వాటికి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ చెరువుల కబ్జాపై, తాసిల్దార్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల వరకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మందపల్లి గ్రామస్తులు సముద్రాల శంకర్, ఆకుల భీమన్న ఆకుల సత్యవ్వ ఎండి లతీఫా హబీబా బేగం ఆకుల రజిత బాలిక సువర్ణ, బాల్త వెంకటవ తదితరులు ఉన్నారు.
చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



