అనుమతిలేని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

 అదనపు కలెక్టర్‌కు పీడీఎస్‌యూ వినతి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
పట్టణంలో అనుమతులు లేకుండా నడిపిస్తున రోసోనెన్స్‌ అకాడమీ పాఠశాల యాజమాన్యంపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం అదనపు కలెక్టర్‌ శ్యామలదేవిని కలిసి వినతపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ర్యాంకుల పేరుతో విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నా కార్పోరేట్‌ విద్యాసంస్థలను రద్దు చేయాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఫీజుల దోపిడీ చేయడం లక్ష్యంగా నడుస్తున్నయని అన్నారు. ఒకటి, రెండు ర్యాంకులను చూపిస్తూ, ఫ్లెక్సీలతో, కరపత్రాలతో మైమరిపిస్తు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సరైనది కాదన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులను ప్రభుత్వ విద్యాసంస్థలలో చేర్పించి బలోపేతం చేయలన్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రయివేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఫీజుల దోపిడిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అశోక్‌ వినోద్‌ ఉన్నారు.

Spread the love