ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

నవతెలంగాణ-వీణవంక
ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్సై బీ వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని ఎల్బాక గ్రామంలో శుక్రవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్ తారసపడినట్లు చెప్పారు. కాగా డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఇసుకను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా డ్రైవర్ మానకొండూర్ మండలంలోని వేగురుపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని కొమిరే ప్రణయ్, వంశీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు.

Spread the love