బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ టెస్టులో నటి హేమకు పాజిటివ్

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు. వారిలో తెలుగు నటి కూడా ఉన్నట్లు చెప్పారు. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్‌, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు.

Spread the love