Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెక్ పోస్టును సందర్శించిన అదనపు కలెక్టర్

చెక్ పోస్టును సందర్శించిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో వరి ధాన్యం కొనుగోలు చేపడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుండి వరి ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా మన రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ సమీపంలో తనిఖీ అంతర్రాష్ట్ర చెక్పోస్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సరిహద్దు చెక్పోస్ట్ ను గురువారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. చెక్పోస్టులో పకడ్బందీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టరు వెంట మద్నూర్ తహశీల్దార్ ఎండి ముజీబ్, చెక్పోస్ట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -