Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలు స్వీయ గణన చేసుకోవచ్చు

ప్రజలు స్వీయ గణన చేసుకోవచ్చు

- Advertisement -

కామారెడ్డి అదనపు కలెక్టర్ వి విక్టర్ 
నవతెలంగాణ – మద్నూర్ 

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ గురువారం మద్నూర్ మండలం పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జనగణన ఎన్యూమరేటర్ లకు రెండో బ్యాచ్ కు శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. జనగణనలో పాల్గొనడం గొప్ప అవకాశం అని, ఎంతో అనుభవాన్ని నేర్పుతుందని అన్నారు. సక్రమంగా, శ్రద్ధగా జనగణన చేయాలన్నారు.

ప్రజలకు జనగణన, స్వీయ గణన పై సోషల్ మీడియా వేదిక పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గణన – స్వయంగా వివరాలను నమోదు చేసుకోవడం కోసం పౌరులు తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సొంతంగా మొబైల్ లేదా కంప్యూటర్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది అన్నారు. https://se.census.gov.inపై పోర్టల్ (లింక్ ద్వారా) ఈ నెల 26వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు అన్నారు. అనంతరం ఎన్యూమరేటర్లకు జనగణన కిట్ బ్యాగ్ లను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఏ ఎస్ ఓ దత్తు, సీనియర్ అసిస్టెంట్ మురళీధర్, శివకాంత్, శివరామ్ , రవి,ఎన్యూమరేటర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -