పలు గ్రామాలను ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

– గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ రమేష్ తో కలిసి పల్లె ప్రకృతి వినాలని పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్ ప్రియాంక
– అడిషనల్ కలెక్టర్ ప్రియాంక
నవ తెలంగాణ- సుల్తానాబాద్ రూరల్
సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాలను అడిషనల్ కలెక్టర్ ప్రియాంక ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్య పల్లి, గ్రామాలలో వైకుంఠధామం మరియు పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో నిర్వహిస్తున్న శానిటేషన్ పనులు మరియు గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ  సాధారణ ముక్కలతో పాటు గ్రామ ప్రజలకు ఉపయోగంగా ఉంటే డ్రాగన్ ఫ్రూట్ జామ మామిడి దానిమ్మ ఇతరత్న మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ సర్పంచులు చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా గ్రామ కార్యదర్శులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని వర్షాకాలం దృష్ట్యా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు.లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. సర్పంచులు బండారి రమేష్, మోలుగూరి వెంకటలక్ష్మి అంజయ్య గౌడ్,చేలుకల బాపురెడ్డి,  లతోపాటు డిపిఓ డిఎఫ్ఓ ఎంపీడీవో శశికళ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Spread the love