జోనల్ స్థాయి ముగింపు కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డీసీపీ

Additional DCP attended the zonal level closing ceremonyనవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని కంజర శివారులో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న పదవ జోనల్ స్థాయి క్రీడోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 7 వ బెటాలియన్ అడిషనల్ డీసీపీ ఎమ్ ఐ సురేష్ ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడికి నాలుగు జిల్లాల నుండి విద్యార్థులు రావడం ఎంతో గొప్ప విషయం అనీ ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు జోనల్ ఆఫీసర్ ఫోరెన్స్ రాని, పాఠశాల ప్రిన్సిపల్ విజయలత నీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 గురుకుల పాఠశాలల నుండి 1190 మంది విద్యార్థులు ఇక్కడ ఒకే దగ్గర చూడడం పండగ వాతావరణంగా ఉందని చదువుతోపాటు క్రీడారంగం కూడా చాలా ముఖ్యమని ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి ఈ క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచారని గెలుపోటములనది సహజమని ఓటమి అనేది గెలుపుకు పునాది అని, ఆడవారు ఒకప్పుడు వంటింట్లో పరిమితమయ్యేవారు కానీ మగవారి కంటే దీటుగా కూడా ఈరోజు క్రీడల్లో ప్రావీణ్యం పొందుతున్నారని మన దేశంలో ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో నిలిచిన వారిలో ఆడవారే ఎక్కువ మెడల్స్ నీ  తీసుకువచ్చారని ఆయన తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ పోటీలో పాల్గొన్న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్లాలని తమ కళాశాలకు మరియు తల్లిదండ్రులకు దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ముఖ్యంగా పాఠశాల ప్రాంగణంలో పోలీసువారి ఆధ్వర్యంలో సంఘవిద్రోహక శక్తుల పైన ఏర్పాటు చేసిన విన్యాసం అక్కడ వచ్చిన వారికి ఎంతగానో ఆకట్టుకుంది, ఆడవారు తమ ఆత్మ రక్షణ కోసం ఎలా మెలగాలి ఎలా ఉండాలి అనే దానిపైన చక్కటి విన్యాసాన్ని చేసి చూపించారు. అలాగే ప్రిన్సిపల్ విజయలత మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమానికి చేయూతను అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులకు మరియు పిటి టీచర్లకు వారి స్కూల్ కు సంబంధించిన ఫ్యాకల్టీ అందరి కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు అలాగే అక్కడికి వచ్చిన డీసీపీ సురేష్ చేతుల మీదగా విన్నర్స్ కి ప్రైజులను అందించడం జరిగింది.
Spread the love