Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూ. కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

ప్రభుత్వ జూ. కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

- Advertisement -

 నవతెలంగాణ – కామారెడ్డి
ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డిలో 2026 – 27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ జయకుమారి తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కళాశాలలో చేరాలని ఆమె కోరారు.

కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు అందుబాటులో ఉండగా, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో విద్యను అందిస్తున్నారు. అదనంగా ఎంఫీహెచ్‌డబ్ల్యూ (MPHW), ఎంఎల్‌టీ (MLT), ఏసీఈ (ACE) వంటి ఒకేషనల్ కోర్సులు  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు కూడా అందజేయబడతాయని పేర్కొన్నారు. అంతేకాక, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అందువల్ల విద్యార్థులందరూ కళాశాలకు హాజరై వెంటనే అడ్మిషన్లు పొందాలని ప్రిన్సిపల్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -