నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్‌ఎల్)ను ప్రకటించామని తెలిపారు. అందుకు సంబంధించిన విదరాలు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామని సూచించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మెరిట్ జాబితాను రూపొందిస్తామని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 837 ఏఈ పోస్టుల భర్తీకి 2022, సెప్టెంబర్ 12న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.