తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు
నవతెలంగాణ – పరకాల
జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుత సాగు సీజన్‌లో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అత్యవసరమని, అయితే బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో సాగు పనులు పూర్తిగా స్థంభించిపోయే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతలకు ఈ కొరత గోరుచుట్టుపై రోకలిపోటులా మారిందని, రైతులు డీజిల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని పేర్కొన్నారు. పౌర సరఫరా శాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, ప్రతి మండల కేంద్రంలో రైతులకు సరిపడా డీజిల్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, వ్యవసాయ పనులకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు.
డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



