నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం ప్రధాన ఘాటుకు అహల్య భాయ్ హుల్కర్ నామకరణ చేయడం జరిగింది. గతంలో అహల్యాబాయ్ హోల్కర్ కందకుర్తి గోదావరిలో నున్న రాతి శివాలయాన్ని నిర్మించడానికి ప్రధాన కారకురాలని, కందకుర్తి గ్రామానికి అనేక సేవలు అందించిన ఘనత ఆమెకే దక్కుతుందని, అందుకే ఆమె పేరు మీదుగా ప్రధాన గాటు నామకరణం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు సురేష్ బాబు, అప్పల ప్రసాద్ జి, సృజన్ గజానన్, బాలరాజు, గంగ నరసయ్య, సురేష్, సతీష్, బి .రమేష్, నగేష్, జి. సతీష్, సాయికిరణ్, గంగరాజు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.