ఎయిర్ ఇండియా ఆహారంలో బ్లేడ్..

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్‌ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన యాజమాన్యం, అది తమ క్యాటరింగ్ పార్ట్‌నర్ వెజిటబుల్ మెషీన్‌లో నుంచి వచ్చినట్లు తెలిపింది.

Spread the love