ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి అల్క‌రాజ్

నవతెలంగాణ-హైదరాబాద్ : పారిస్‌: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సెమీస్‌లోకి కార్లోస్ అల్క‌రాజ్ ఎంట‌ర‌య్యాడు. క్వార్ట‌ర్స్‌లో అత‌ను 6-2, 6-1, 7-6 స్కోర్‌తో స్టెఫానోస్ సిట్‌సిపాస్‌పై విజ‌యం సాధించారు. సెమీస్‌లో జోకోవిచ్‌తో అల్క‌రాజ్ త‌ల‌ప‌డ‌నున్నాడు. ఒక‌వేళ సెమీస్‌లో జోకోవిచ్‌ను ఓడిస్తే, అప్పుడు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మ‌ళ్లీ అల్క‌రాజ్ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి వ‌స్తాడు. ఒక‌వేళ జోకోవిచ్ సెమీస్ గట్టు దాటితే అప్పుడు అత‌నికి మూడోసారి రోలాండ్ గారోస్ టైటిల్ ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. సిట్‌సిపాస్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్స్‌లో అల్క‌రాజ్ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. తొలి రెండు సెట్ల‌ను ఈజీగా గెలిచేశాడు. సిట్‌సిపాస్ ఏమాత్రం అల్క‌రాజ్‌ను అడ్డుకోలేక‌పోయాడు. అయితే మూడో సెట్ ఆస‌క్తిక‌రంగా సాగింది. టై బ్రేక‌ర్ వర‌కు వెళ్లిన ఆ సెట్‌ను కూడా అల్క‌రాజ్ సొంతం చేసుకున్నాడు. బేస్‌లైన్ షాట్స్‌తోపాటు డ్రాప్ షాట్స్‌తో అల్క‌రాజ్ ఆక‌ట్టుకున్నాడు. 20 ఏళ్ల అల్కరాజ్ ఈ సీజ‌న్‌లో దూకుడుమీదున్నాడు.

Spread the love