ఎస్ఎస్ఏ రిలే దీక్షలకు, అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఏఐఎఫ్డిఎస్ సంఘీభావం

నవతెలంగాణ- కంటేశ్వర్
ఎస్ ఎస్ ఏ రిలే దీక్షలకు అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఏఐఎఫ్డిఎస్ శనివారం సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఏఐఎస్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి చేపట్టి రేలే దీక్షలను న్యాయమైన డిమాండ్లను గుర్తించు వారి దీక్షలకు సంగిభావం తెలపడం జరిగింది అని పేర్కొన్నారు, అలాగే కొట్లాడి తెచ్చుకున్నా తెలంగాణలో ఎక్కడి వేసినా గొంగళి అక్కడే అన్నచందంగా తెలంగాణ పరిస్థితి తయారైంది అని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అని అనడానికి సమగ్ర సర్వశిక్ష అభియాన్ పరిధిలోని ఉద్యోగుల రిలే దీక్షాలే చక్కటి ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోలను క్రమబద్ధీకరణ చేస్తానని చెప్పిన KCR మాటలు ఎటు పాయే అని నిలదీశారు, SSA ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తూ, సమాన పనికి సమనవేతనం మరియు మహిళ ఉద్యోగినిలకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవాళని నాయమమైన కోరికలు కూడా తిరచలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమైన స్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగుతూ ప్రజాఉద్యమలకు, ప్రజలు విద్యార్థులు , ఉద్యోగుల ఉద్యమించాలని పిలునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా నాయకులు గోపాల్, సాయి, గణేష్, నితిన్, సాయి కిరణ్ ,మహేష్ ,ప్రతిక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love