
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక, ఆర్థిక కులగణనకు మండలంలో సర్వం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, మోహన లు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సమగ్ర సర్వే ఫారంలో ఉన్న విషయాలను పకడ్బందీగా నింపాలన్నారు. మండలంలో మొత్తం 15,114 ఇండ్లు ఉన్నాయని, వారిని సర్వే చేసేందుకు పదిమంది సూపర్వైజర్లను, 104 మంది ఎన్యుమరెటర్లను ఎంపిక చేసినట్లు వారికి కేటాయించిన గ్రామాలలో వారు సర్వే నిర్వహిస్తారని, ప్రజలందరూ సామాజిక ఆర్థిక సర్వేకు ఇంటికి వచ్చే అధికార్లకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్, మండల ప్రత్యేక అధికారిని రజిత, అధికారులు ఇరిగేషన్ డి ఈ ఆనందం, మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.