నవతెలంగాణ – మద్నూర్
ప్రతి సంవత్సరం మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లి శ్రీ శేత్కరి గణేష్ మండలి వద్ద భారీ ఎత్తున మహా అన్నదాన ప్రసాదం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ మహా అన్నదాన కార్యక్రమం గ్రామంలో జరగని రీతిలో చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు మహాన్న ప్రసాదంలో పాల్గొనడానికి గ్రామంలో గణేష్ మండలి నిర్వాహకులు దండోరా వేయించారు. అన్న ప్రసాదం అనంతరం రాత్రికి లడ్డు హర్రస్ ఉంటుందని దండోరా లో తెలిపారు.