
పట్టణంలోని విజయ హై స్కూల్ టెన్త్ బ్యాచ్ 2005 -06 చదివిన విద్యార్థి బోన్ల దిలీప్ అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది. వారి యొక్క భార్య బోన్ల జయశ్రీ ఇద్దరు పిల్లలతో ఆర్థిక పరిస్థితి బాగోలేక బాధపడుతున్న వారికి బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి రూ.1,50,000 ఆర్థిక సాయం గురువారం అందజేసినారు. వారి యొక్క పిల్లలకు చదువుకు సంబంధించిన ఎటువంటి సహాయం అయినా బ్యాచ్ మెన్స్ అందరు కలిసి సహాయపడతామని అండగా ఉంటామని, ఈ కార్యక్రమంలో తలారి చందు, నితీష్ వైద్య, అన్వేష్ సునీల్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.