వాలీబాల్ అండర్ 19కి ఎంపికైన మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థులు

నవతెలంగాణ- ఆర్మూర్:  వాలీబాల్ అండర్ 19 ఎస్ జి ఎఫ్ టోర్నమెంట్ కి మండలంలోని మగిడి పాఠశాల పూర్వ విద్యార్థులు M సాయి తేజ, S బాలరాజ్. లు ఎంపికైనట్టు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మధు గురువారం తెలిపారు. అందాపూర్ గ్రామం నుండి వచ్చి మగ్గిడి పాఠశాలలో చదివినట్టు వీరు ఇరువురు నీటి నుంచి సిద్దిపేట లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు తెలపడం జరిగింది. వీరి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత, గ్రామ సర్పంచ్ సుమలత నరసయ్య, వీడీసీ సభ్యులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది.

Spread the love