అమ్మ ఆదర్శ కమిటిలో పనులు చేయించాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి

అమ్మ ఆదర్శ కమిటి లో మహిళ సంఘాలతో పనులు చేయించాలని, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం ను సమయాను సారం అందజేసే విధంగా చూడాలని ఎపిడి రవీందర్ అన్నారు.బుదవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం లో యూనిఫాం తయారు చేసే వారితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఇందల్ వాయి మండలం లో 3399 మంది పిల్లలు వున్నారని దిని లో  బాయ్& గర్ల్ కి కుట్టడానికి ఒక జాతకు  50 రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఎవరికైన  కట్టింగ్ చేసి ఇవ్వడానికి నిజామాబాద్ దేవేందర్ వస్తారని,ఇది మంచి అవకాశమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కట్టింగ్ వచ్చిన వారు కాట్టింగ్ చేసి ఇవ్వలని వివరించారు. డ్రేస్ తయారు చేసే వారు  ఒకేదగ్గరకు చేరి సెంటర్ లోనే అందురు కలిసి తయారు చేసే విధంగా చుసుకోవలని పేర్కొన్నారు.పాఠశలల్లో అమ్మ ఆదర్శ కమిటి లో కూడా పనులను అప్పగించి చేయించే విధంగా చొరవ చూపాలని కోరారు.వి. ఓ. ఏ లు  లోకస్ ఆప్ ద్వారా నమోదు చేస్తున్న సంఘం సభ్యుల వివరాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో డిపిఎం సాయిలు,ఇందల్ వాయి మండల ఎపిఎం సువర్ణ,సిసి ఉదయ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Spread the love