రూ.25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇప్పించాలి

– నెమలి నరసయ్య పారిశుధ్య కార్మికుల ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక కోఆర్డినేటర్
నవతెలంగాణ – గోవిందరావుపేట
విధి నిర్వహణలో అనారోగ్యంతో మృతి చెందిన పంచాయతీ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని పారిశుధ్య కార్మికుల ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక కోఆర్డినేటర్ నెమలి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న అలెగ్జాండర్ కుమారుడు క్షయ వ్యాధికి అకస్మాత్తుగా కొన్ని రోజుల క్రితం మృతి చెందగా మృతుని కుటుంబానికి 50 కేజీల సన్న బియ్యం, ఐదు వేల రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ..  దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ  పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీవిత బీమా రుసుములకు ప్రభుత్వమే చెల్లిస్తూ చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయలు ఏక్ష్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మహాజన పారిశుధ్య కార్మికుల &  ఉద్యోగుల సమాఖ్య (జి పి ఎం ఈ ఎఫ్)  మండల ఇన్చార్జి దుస్సా సతీష్ మహాజన్, జిల్లా కార్యదర్శి దొంగరి ఉప్పలయ్య మహిళా విభాగం జిల్లా ఇన్చార్జి నౌడూరు విజయక్క. బ్లాక్ ఇంచార్జ్ యాస సంజీవరెడ్డి కారోబార్ వేమునూరి శివకుమార్ ఏర్ర శ్రీకాంత్, కొగిల ఈశ్వరి, బోడా సుమన్, లక్ష్మీ, తదితర గ్రామపంచాయతీ సిబ్బంది హాజరైనారు.
Spread the love