అంగన్‌వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Anganwadi teachers should be recognized as government employeesమహాదేవపూర్‌ : మండల కేంద్రంలో రెండు రోజుల నుంచి అంగన్వాడీల సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మహదేవపూర్‌ మండల కేంద్రంలో ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు మంగళవారం మహాదేవపూర్‌ పలిమల మండలాల టీచర్ల సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొలం రాజేందర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొలం చిన్న రాజేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు కుమార్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆడప సంతోష్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని కోరారు. పక్కనే ఉన్న తమిళనాడు, రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, హెల్త్‌ కార్డులు ఇచ్చారని, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌, పండుగ బోనస్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకురటే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు.
మహాదేవపూర్‌ : మండల కేంద్రంలో రెండు రోజుల నుంచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించా లని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెకు మంగళ వారం ఎస్‌ఎఫ్‌ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్‌కుమార్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు వారికి అండగా పోరాడుతామని అన్నారు. మహాదేవపూర్‌, పలిమల మండలాల అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
మల్హర్‌రావు : అంగన్‌వాడీల, ఆయాల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా మండలంలోని తాడిచెర్ల, కొయ్యుర్‌ సెక్టార్ల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు మండల కేంద్రమైన తాడిచెర్లలో తహసీల్ధార్‌ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారికి తాడిచెర్ల 2వ వార్డు సభ్యుడు బండి స్వామి మద్దతు ప్రకటించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వెలు ఇవ్వాలని, రిటైర్డ్‌ బెనిఫిట్‌ టీచర్‌ కు రూ.10 లక్షలు, ఆయాకు రూ.5 లక్షలు ఇవ్వాలని, హెల్త్‌ కార్డు రూ.5 లక్షలు ఇవ్వాలని, జీతంలో సగం పింఛను ఇవ్వాలని, తదితతర డిమాండ్లు చెల్లించాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్లు జయప్రద, అరుణ, రమాదేవి, పద్మ, అన్నపూర్ణ పాల్గొన్నారు.
ఏటూరునాగారం ఐటీడీఏ : అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌ టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ టీచర్లు చేపట్టిన సమ్మె మంగళవారం రెండవ రోజు కొనసాగింది.ఈ సందర ్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె సమ్మక్క సమ్మెలో పాల్గొని మాట్లాడారు. నిరవధిక సమ్మె చేస్తుంటే అప్రజాస్వామికంగా అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగులగొడుతున్నారని, ఈ చర్యను ఆపి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అంగన్వాడీలు జమున, సరిత, లలిత, వెంకటేశ్వరి, అరుణ, విజయలక్ష్మి, రుక్మిణి, ఇందిర, రమాదేవి, నిర్మల, సుమలత, ఆదిలక్ష్మి, దమయంతి, పార్వతి తదితరులు 80 మంది పాల్గొన్నారు.

Spread the love