ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా కల్తీ శ్రీనివాస్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ ఉన్నతపాఠశాల కర్లపల్లి ప్రధానోపాధ్యాయులు కల్తీ. శ్రీనివాస్ జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా స్వాతంత్ర దినోత్సవం నాడు ఐటిడిఏ పిఓ అంకిత్ చేతుల మీదుగా మంగళవారం అవార్డు అందుకున్నారు. ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డు అందుకున్న కల్తీ శ్రీనివాస్ కు సొంత పాఠశాల తో పాటు వివిధ పాఠశాలల  ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాల్గవ తరగతి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. కర్లపల్లి పాఠశాలలో గత నాలుగు సంవత్సరాలుగా వివిధ పాఠశాలల విద్యార్థులకు కోచింగ్ క్యాంపు నిర్వహించడంతో వందశాతం ఫలితాలు సాధించడంలో కృషి చేయడం జరిగింది అందుకు గాను  ప్రాజెక్ట్ ఆపిసర్  ఐ.టి.డి.ఏ, ఏటూరునాగారం అంకిత్ ఐ. ఏ. ఎస్  చేతుల మీదిగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు అవార్డు అందుకోవడం జరిగింది.
Spread the love