కెనరా బ్యాంకులో అర్హులైన రైతులకు రుణమాఫీ రాలేదని ఆగ్రహం..

Anger that eligible farmers did not get loan waiver in Canara Bank.

– బ్యాంకు ఎదుట బైఠాయించి ధర్నా..

– ఆర్ ఎం వచ్చేవరకు ధర్నాను నిలిపే ప్రసక్తే లేదు..
నవతెలంగాణ – రెంజల్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ రుణమాఫీ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కెనరా బ్యాంకుల అధికారుల తప్పిదం వల్ల చాలామంది రైతులకు  రుణమాఫీ రాలేదని స్థానిక రైతుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంకు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అర్హులైన సన్న చిన్న కారు రైతులకు రుణమాఫీ రాకపోవడానికి అధికారులే బాధ్యత వహించాలని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎం  వచ్చేవరకు ధర్నా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని అవసరమైతే అధికారులను నిర్బంధిస్తామని వారు భీష్మించి కూర్చున్నారు. తెలంగాణ మొత్తంలో కెనరా బ్యాంకులో మాత్రమే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రైతన్నలు లేకపోతే బ్యాంకులు ఎలా పనిచేస్తాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత బ్యాంక్ అధికారులు వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని వారు బైఠాయించడంతో స్థానిక బ్యాంకు మేనేజర్ నాగనాథ్ రైతుల వద్దకు వచ్చి రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను రప్పించాలని వారు పట్టుపట్టారు. ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. త్వరలోనే బ్యాంకుల్లో జరిగిన తప్పిదాల గురించి సరిచేసి ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటామని బ్యాంకు మేనేజర్ నాగనాథ్ వారికి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
Spread the love