నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని మగ్గిడి గ్రామ సమీపంలో గల ఇటుక బట్టి కార్మికులకు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం సామూహిక అన్నప్రసన, గర్భిణి స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించినట్టు అంగన్వాడి సూపర్వైజర్ వెంకట రమణమ్మ తెలిపారు. ఇక్కడ గల చిన్నారులకు బాలామృతం తో పాటు పండ్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.