హెచ్-1బీ వీసాల రద్దుపై వివేక్ రామస్వామి మరో ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: హెచ్-1బీ వీసాలపై తను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో భారత సంతితి అమెరికన్ నేత వివేక్ రామస్వామి తాజాగా వివరణ ఇచ్చారు. తాను హెచ్-1బీ వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానని మాత్రమే అన్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు.  ‘‘హెచ్-1బీ వీసా విషయంలో నేను అడ్డంగా బుక్కైపోయానని ఓ వార్తా సంస్థ అనుకుంది. హెచ్-1బీ వీసాను రద్దు చేస్తానంటూనే ఈ వీసా ఉన్న వారిని నా సంస్థల్లో నియమించుకున్న విషయాన్ని పేర్కొంది. ఆ మాటకొస్తే అమెరికాలో ఇంధన రంగంలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. అలా అని నేను నీరు, విద్యుత్ వినియోగం ఆపేయలేదు కదా? వాస్తవానికి ఏ సంస్కరణలు చేపట్టాలనేదానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. విదేశీ వీసా విధానంలో లాటరీ పద్ధతి అర్థరహితం. ఇక హెచ్-1బీ వీసా అంటే పూర్తిగా వెట్టి చాకిరీనే. ఇది కార్పొరేట్ వర్గాల లాబీయింగ్ కారణంగా అమల్లోకి వచ్చింది’’ అంటూ ఆయన తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.

Spread the love