వైసీపీకి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ

నవతెలంగాణ- అమరావతి: వైసీపీకి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపు వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను వైసీపీ.. సుప్రీంలో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. తాము ఇందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఇప్పటికే పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకు వచ్చిన వైసీపీకు ఇక్కడ కూడా చుక్కెదురైంది.

Spread the love