రాహుల్‌ గాంధీ మరో యాత్ర..’భారత్‌ న్యాయ యాత్ర’

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీకీ వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు ‘భారత్‌ న్యాయ యాత్ర’ చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు మొత్తం 6,200 కి.మీ మేర దీనిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించనున్నట్లు పేర్కొన్నారు

Spread the love