అన్ని గ్రామ సంఘాలు లాభాల బాటలో నడిపించే విధంగా ప్రయత్నం చేయాలి: ఏపిఎం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని అన్ని గ్రామ మహిళ సంఘాలు లాభాల బాటలో పయనించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీఎం రవీందర్ రెడ్డి గురువారం అన్నారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల మహిళా సమైక్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ అన్ని గ్రామ సంఘాలలో బ్యాంకు రుణాలు శ్రీని రుణాలు గ్రామ సంఘం రుణాలు , చిన్న సంఘం రుణాలు అందజేస్తూ మహిళా సంఘాలను అభివృద్ధి బాటలో నడిపించాలని తెలిపారు. ప్రతి ఫైసా ప్రతి రుణం తీసుకుని ఆదయ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకుని దేశంలో ఆదర్శంగా ఉండాలని సూచించారు. మహిళా సంఘాల కట్టుబాట్లతోని కుటుంబాలు గ్రామాలు పట్టణాలు అన్ని బాగుంటాయని తెలిపారు. కాబట్టి ప్రతి శీల సంఘంలో కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుని ప్రతి సభ్యురాలు అవసరం తీరుస్తూ ఆ కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తెలియజేశారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాల కు పెద్ద బాధ్యతన అప్పజెప్పిందని పాఠశాలల నిర్వహణ కొరకు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మహిళ గ్రామ సంఘం అధ్యక్షురాలు చైర్మన్గా కొనసాగుతూ పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు ప్రాథమికంగా మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల మహిళా గ్రామ సంఘం అధ్యక్షులు కమ్యూనిటీ కోఆర్డినేటర్ లు, మండల మహిళా సమైక్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love